భారతదేశం, ఏప్రిల్ 4 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 322 పాయింట్లు పడి 76,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 23,250 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 249 పాయింట్లు పెరిగి 51,597 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,806 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 221.47 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 19,246.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,352.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లపై 'ట్రంప్​ టారీఫ్​' పిడుగు పడింది. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు అత్యంత భారీ నష్టాల్లో ము...