భారతదేశం, జనవరి 26 -- గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ మెుత్తం కలిపి రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 428.87 పాయింట్లు(0.55 శాతం) పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు(0.47) శాతం పడిపోయింది.

మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.74,969.35 కోట్లు క్షీణించి రూ.16,85,998.34 కోట్లకు పడిపోయింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) విలువ రూ.21,251.99 కోట్లు క్షీణించి రూ.5,19,472.06 కోట్లకు పరిమితమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ.17,626.13 కోట్లు తగ్గి రూ.6,64,304.09 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.11,549.98 కోట్లు తగ్గి రూ.8,53,945.19 కోట్లకు పడిపోయింది.

మరోవైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,...