భారతదేశం, మార్చి 11 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 218 పాయింట్లు పడి 74,115 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 92 పాయింట్లు కోల్పోయి 22,460 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 281 పాయింట్లు పతనమై 48,217 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 22405-22320 లెవల్స్​ 38.2శాతం, 50శాతం ఫిబనాచీ రిట్రేస్​మెంట్​గా ఉన్నాయి. 22,250-22,230 దగ్గర కీలక సపోర్ట్​ ఉంది. 22,800-23,000 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ఉన్నాయి," అని మిరాయ్​ అసెట్​ షేర్​ఖాన్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ జతిన్​ గేడియా తెలిపారు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 485.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 263.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ...