భారతదేశం, మే 13 -- Star Review: కెవిన్‌, లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ స్టార్ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ సినిమాకు ఎలాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రీతీ ముకుంద‌న్‌, అదితి పొన్న‌క‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. హీరోగా మారాల‌నే ఓ యువ‌కుడి త‌ప‌న‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? లేదా? అంటే?

పాండియన్ (లాల్‌) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు క‌లై(కెవిన్‌)ని సినిమా యాక్ట‌ర్ చేయాల‌ని క‌ల‌లు కంటాడు. తండ్రి ఎంక‌రేజ్‌మెంట్‌తో చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా పిచ్చితోనే పెరుగుతాడు క‌లై. ఇంట‌ర్ బోర్డ‌ర్ మార్కుల‌తో పాసైన క‌లై త‌ల్లి పోరుప‌డ‌లేక ఇంజినీరింగ్ చేరుతాడు. అక్క‌డే క‌లైకి మీరా (పీతీ ముకుంద‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు.

త‌ల్లికి చెప్ప‌కుండా తండ్రి ప్రోద్భ‌లంతో యాక్టింగ్ కోర్సులో జాయిన్ కావ‌డాని...