Hyderabad, మార్చి 7 -- Star Maa TV Shows TRP Ratings: స్టార్ మా అటు సీరియల్స్, ఇటు ప్రోగ్రామ్స్ లోనూ దూసుకెళ్తోంది. తాజాగా 8వ వారానికి సంబంధించి రిలీజైన రేటింగ్స్ లో ఈటీవీ షోలను వెనక్కి నెట్టి టాప్ లో స్టార్ మా షోలే ఉన్నాయి. మరి ఈ లేటెస్ట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

స్టార్ మా ఛానెల్లో వచ్చే ఇస్మార్ట్ జోడీ సెలబ్రిటీ గేమ్ షో తాజా రేటింగ్స్ లో తొలి స్థానంలో నిలవడం విశేషం. తాజాగా స్టార్ మాలో మూడో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే 22 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రోగ్రామ్ తాజా రేటింగ్స్ లో అర్బన్, రూరల్ కలిపి 4.34తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో కొన్ని సెలబ్రిటీ జోడీలను తీసుకొచ్చి వాళ్లతో సరదా గేమ్స్ ఆడిస్తుంటారు. ప్రతివారం ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి.

ఇక రెండో స్థానంలోనూ స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార...