Hyderabad, మార్చి 20 -- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 10వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. టాప్ 6 స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గతవారం ఉన్న సీరియల్సే ఇప్పుడూ కొనసాగాయి. అయితే 2 నుంచి 4 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ నెలకొంది. తరచూ ఈ మూడు స్థానాల్లోని సీరియల్స్ కాస్త పైకి, కిందికి మారుతూ ఉన్నాయి.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే.. కార్తీకదీపం 2 సీరియల్ దుమ్ము రేపింది. 10వ వారం రిలీజైన రేటింగ్స్ లో ఈ సీరియల్ ఏకంగా 13.78 రేటింగ్ సాధించడం విశేషం. అటు అర్బన్, ఇటు రూరల్.. రెండు ప్రాంతాల్లోనూ ఈవారం కార్తీకదీపమే టాప్ లో ఉంది. ఇప్పట్లో ఈ సీరియల్ టాప్ ప్లేస్ ను ఆక్రమించడం మరో సీరియల్ కు సాధ్యమయ్యేలా లేదు.

అయితే రెండో స్థానంలోకి మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకొచ్చింది. ఈ సీరి...