Hyderabad, మార్చి 6 -- Star Maa Serials TRP Ratings: స్టార్ మాతోపాటు జీ తెలుగు, జెమెని, ఈటీవీ సీరియల్స్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ గురువారం (మార్చి 6) వచ్చేశాయి. ఈ ఏడాది 8వ వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇవి. ఇందులో మారోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

తెలుగు టీవీ సీరియల్స్ లో కొన్నేళ్లుగా స్టార్ మా ఆధిపత్యమే కొనసాగుతున్న విషయం తెలుసు కదా. అయితే ఆ సీరియల్స్ మధ్య కూడా హోరాహోరీ పోరు నడుస్తూనే ఉంది. తాజాగా 8వ వారానికి సంబంధించిన రేటింగ్స్ లో కార్తీకదీపం 2 సీరియల్ 13.32 రేటింగ్ తో తొలిస్థానంలో కొనసాగుతోంది. బ్రహ్మముడి టైమ్ మారిన తర్వాతి నుంచీ ఈ కార్తీకదీపం హవా మొదలైన విషయం తెలిసిందే.

ఇక రెండు నుంచి నాలుగు స్థానాల మధ్య కొన్నాళ్లుగా గట్టి పోటీ ఉంటోంది. ఈవారం రెండో స్థానాన్ని తిరిగి ఇల్లు ఇల్లాలు పిల్లలు...