Hyderabad, ఫిబ్రవరి 13 -- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఐదో వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే ఈ వారం రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 3 నుంచి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వెళ్లిపోగా.. గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం సీరియల్స్ వచ్చాయి. మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

ఐదో వారానికి సంబంధించి స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ చూస్తే.. కార్తీకదీపం 2 టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. ఆ సీరియల్ కు 13.71 రేటింగ్ నమోదైంది. అయితే అర్బన్ కంటే రూరల్ ఏరియాలో ఈ సీరియల్ కు ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో ఈ సీరియల్ కు కేవలం 10.23 రేటింగే వచ్చింది. ఇక రెండో స్థానంలోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ దూసుకొచ్చింది. తాజా రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 13.0...