Hyderabad, ఏప్రిల్ 10 -- Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లో అగ్రస్థానం మరోసారి మారిపోయింది. కొన్నేళ్లుగా మొదట బ్రహ్మముడి, తర్వాత కార్తీకదీపం 2 నంబర్ వన్ సీరియల్స్ గా ఉండేవి. అయితే తొలిసారి ఈ రెండూ కాకుండా ఓ కొత్త సీరియల్ అగ్రస్థానాన్ని ఆక్రమించడం విశేషం. తాజా రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూడండి.

స్టార్ మా ఛానెల్ 13వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే కొన్నాళ్లుగా టాప్ లో ఉంటూ వస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ ఈ వారం తన రేటింగ్ ను దారుణంగా కోల్పోయింది. దీంతో నంబర్ వన్ స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆ సీరియల్ కు 13వ వారం అర్బన్, రూరల్ కలిపి 11.68 రేటింగ్ మాత్రమే నమోదైంది.

కార్తీకదీపం 2 స్థానంలో కొత్తగా గుండెనిండా గుడిగంటలు సీరియల్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆ సీరియల్ కు తాజాగా 11.76 రేటింగ్ ...