Hyderabad, ఏప్రిల్ 17 -- Star Maa Serials TRP Ratings: బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో మరోసారి సత్తా చాటింది. ఈ సీరియల్ టైమ్ మారిన తర్వాత క్రమంగా టాప్ లో నుంచి కిందికి వెళ్లిపోగా.. తాజాగా 14వ వారం రేటింగ్స్ లో మాత్రం మరోసారి తన రేటింగ్ ను కాస్త మెరుగుపరుచుకుంది. అయితే కార్తీకదీపం 2తోపాటు మిగిలిన సీరియల్స్ రేటింగ్స్ అన్నీ దారుణంగా పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 14వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. గత వారం తన టాప్ ర్యాంకింగ్ కోల్పోయిన కార్తీకదీపం 2 సీరియల్ ఈసారి మళ్లీ టాప్ లోకి వచ్చింది. అయితే ఈ సీరియల్ సహా మిగిలిన టాప్ 5 సీరియల్స్ రేటింగ్స్ పడిపోయాయి.

కార్తీకదీపం 2 సీరియల్ కు 10.75 రేటింగ్ నమోదైంది. ఇక గుండెనిండా గుడిగంటలు 10.56 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 10.16...