Hydrerabad, ఏప్రిల్ 4 -- Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ 12వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈసారి టాప్ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగులో వచ్చే సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ అన్నీ కాస్త తగ్గాయి. అయితే టాప్ 10 సీరియల్స్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

స్టార్ మా సీరియల్స్ కు సంబంధించి 12వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీకదీపం 2 సీరియల్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ సీరియల్ కు 12.86 రేటింగ్ వచ్చింది. నిజానికి గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ 13కు తగ్గకుండా రేటింగ్ సాధిస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం కాస్త తగ్గింది. ఇక రెండో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ రేటింగ్ కూడా 12 కంటే తగ్గింది. తాజా రేటింగ్స్ లో 11.93 సాధించింది.

మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియ...