Hyderabad, మార్చి 6 -- Star Maa Serials: తెలుగు టీవీ సీరియల్స్ అంటే స్టార్ మా సీరియల్సే అనేలా దుమ్ము రేపుతున్నాయి ఈ ఛానెల్లో వచ్చే సీరియల్స్. ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10లో చాలా వరకు ఈ ఛానెల్లో వచ్చేవే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం మిగిలిన ఛానెల్స్ కు ఒక్క స్లాట్ కూడా ఛాన్స్ వదలకుండా అన్నింట్లోనూ ఆధిపత్యం సాధించడం విశేషం.

స్టార్ మా ఛానెల్లో వచ్చే సీరియల్స్ 8వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో ఓ అరుదైన ఘనత సాధించాయి. ఈ ఛానెల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి స్లాట్ లో వచ్చే సీరియల్సే టీఆర్పీ రేటింగ్స్ లో మిగిలిన ఛానెల్స్ సీరియల్స్ కంటే ముందున్నాయి. ఇటు అర్బన్, అటు రూరల్.. రెండు ఏరియాల్లోనూ స్టార్ సీరియల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

స్టార్ మా ఛానెల్లో ఏ సమయానికి ఏ సీరియల్ వస్తుందో ఒకసారి చూద్దాం. మధ్యా...