భారతదేశం, మార్చి 3 -- స్టార్ మా సీరియ‌ల్‌ స‌త్య‌భామ‌కు మేక‌ర్స్ శుభం కార్డు వేయ‌బోతున్నారు. టీఆర్‌పీలో అద‌ర‌గొడుతోన్న ఈ సీరియ‌ల్‌కు స‌డెన్‌గా ముగింపు ప‌ల‌క‌డం బుల్లితెర ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా మారింది. మార్చి 8న స‌త్య‌భామ సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం. స‌త్య‌భామ ప్లేస్‌లో కొత్త సీరియ‌ల్ భానుమ‌తి ప్ర‌సారం కానుంది. భానుమ‌తి సీరియ‌ల్ మార్చి 10 నుంచి టెలికాస్ట్ కానున్న‌ట్లు స్టార్ మా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. స‌త్య‌భామ సీరియ‌ల్ ప్ర‌స్తుతం సాయంత్రం ఆరు గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతోంది. అదే టైమ్ స్లాట్‌ను భానుమ‌తికి కేటాయించారు.

స‌త్య‌భామ సీరియ‌ల్‌లో నిరంజ‌న్‌, దేబ్జానీ మోద‌క్‌ జంట‌గా న‌టించారు. క్రిష్, స‌త్య అనే క్యారెక్ట‌ర్స్‌లో న‌టించారు. స‌త్య‌భామ సీరియ‌ల్ 2023 డిసెంబ‌ర్ 18న మొద‌లైంది. సోమ‌వారం నాటితో ఈ సీ...