భారతదేశం, మార్చి 8 -- Star Maa Serial: బిగ్‌బాస్ త‌ర్వాత నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా ఆఫ‌ర్లు రావ‌డంతో నిఖిల్ సీరియ‌ల్స్‌కు దూరంగా ఉంటాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ న‌టుడిగా త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెర వైపే మొగ్గుచూపాడు. నిఖిల్ కొత్త సీరియ‌ల్‌పై అప్‌డేట్ వ‌చ్చేసింది. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న చిన్ని సీరియ‌ల్‌లోకి నిఖిల్ స‌డెన్‌గా ఇచ్చాడు.

చిన్ని సీరియ‌ల్ శ‌నివారం ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ చివ‌ర‌లో నిఖిల్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎపిసోడ్ చివ‌ర‌లో కావ్య‌శ్రీ స్కూల్ పిల్ల‌ల‌తో క‌లిసి బాస్కెట్‌బాల్ ఆడుతున్న‌ట్లుగా చూపించారు. స‌డెన్‌గా అక్క‌డికి కారులో నిఖిల్ రావ‌డం క‌నిపించింది. కావ్య‌శ్రీ వేసిన బాల్ దూరంగా ప‌డిపోవ‌డంతో ఆ ...