భారతదేశం, ఏప్రిల్ 15 -- Star Maa Serial: మ‌రో కొత్త సీరియ‌ల్‌తో స్టార్ మా అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు బ్ర‌హ్మ‌ముడి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ కొత్త సీరియ‌ల్ టైటిల్‌తో పాటు లీడ్ యాక్ట‌ర్స్ ఎవ‌ర‌న్న‌ది రివీలైంది. ఈ సీరియ‌ల్‌కు నిండు మ‌న‌సులు అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు.

బ్ర‌హ్మ‌ముడి డైరెక్ట‌ర్ కుమార్ పంతం....నిండు మ‌న‌సులు సీరియ‌ల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బ్ర‌హ్మ‌ముడితో పాటు గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్స్‌ను ప్రొడ్యూస్ చేసిన భూమి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిండు మ‌న‌సులును నిర్మిస్తోంది.

నువ్వునేను ప్రేమ సీరియ‌ల్ ఫేమ్ ప‌విత్రా బీ నాయ‌క్ నిండు మ‌నుసులు సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. నువ్వు నేను ప్రేమ‌లో ప‌ద్మావ‌తి పాత్ర ద్వారా తెలుగు సీరియ‌ల్ ల‌వ‌ర్స్‌ను మెప్పించింది ప‌విత్రా బీ నాయ‌క్‌. అమాయక‌త్వం, ధైర్యం క‌ల‌బోసిన...