భారతదేశం, ఏప్రిల్ 5 -- Star Maa Serial: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న మామ‌గారు సీరియ‌ల్‌లోకి గుండె నిండా గుడి గంట‌లు బాలు ఎంట్రీ ఇచ్చాడు. బాలు క్యారెక్ట‌ర్ ప్ర‌వేశంతో సీరియ‌ల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌గా క‌నిపించిన బాలు...మామ‌గారులో మాత్రం పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించి సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు.

గంగ‌కు స‌పోర్ట్‌గా బాలు శ‌నివారం నాటి ఎపిసోడ్ ద్వారా మామ‌గారు సీరియ‌ల్‌లోకి అడుగుపెట్టాడు. త‌న పేరు ఈశ్వ‌ర్ అంటూ ప‌రిచ‌యం చేసుకోవ‌డం ఆస‌క్తిని పంచింది. ఆ త‌ర్వాత అత‌డిని గంగ మాత్రం బాలుగా పిలిచింది. మీ పేరు ఈశ్వ‌ర్ అని అన్నారు అని గంగ బావ అడ‌గ్గా...నా పూర్తి పేరు ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌. నా మ‌న‌సు తెలిసిన వాళ్లు మాత్రం బాలు అని పిలుస్తార‌ని బాలు బ‌దులిస్తాడు.

మీ వారు ఎక్క‌డ అని గ...