Hyderabad, మార్చి 10 -- Star Maa New Serial: స్టార్ మా సీరియల్స్ కు తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఛానెల్ నుంచి కొత్తగా ఏ సీరియల్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు సోమవారం (మార్చి 10) నుంచి భానుమతి పేరుతో మరో కొత్త సీరియల్ ను ఈ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మరి ఈ సీరియల్ ఏంటి? ఎప్పుడు చూడాలన్న విషయాలు తెలుసుకోండి.

స్టార్ మా ఛానెల్ భానుమతి మా ఇంటి మాలక్ష్మీ పేరుతో ఈరోజు (మార్చి 10) నుంచే కొత్త సీరియల్ ప్రారంభిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న స్టార్ మా.. సోమవారం కూడా తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది.

"ఎవరూ ఆపలేని స్ఫూర్తి కలిగిన ఓ అమ్మాయి. అన్ని అడ్డంకులను అధిగమించి భానుమతి ఉన్నత శిఖరాలను అధిరోహించగ...