భారతదేశం, మార్చి 19 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‍లో ఓ గ్లోబల్ రేంజ్ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ అడ్వెంచర్ యాక్షన్ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ అప్‍డేట్ వచ్చింది. అయితే, ఈ సినిమా వర్కింగ్ టైటిల్‍కు కూడా క్లారిటీ వచ్చేసింది.

మహేశ్ - రాజమౌళి మూవీకి షూటింగ్ కొంతకాలంగా ఒడిషాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఇప్పుడు ఫినిష్ అయింది. ఒడిషాలోని కోరపుట్ ప్రాంతంలో సుమారు 15 రోజుల పాటు ఎస్ఎస్ఎంబీ29 చిత్రీకరణ సాగింది. ఒడిషాలో షెడ్యూల్ పూర్తైన సందర్భంగా అక్కడ కొందరు అభిమానులు, స్థానిక అధికారులతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా ఫొటోలు కూడా దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేశ్ బాబు - రాజ...