భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయిలో చాటిచెప్పారు రాజ‌మౌళి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డును ద‌క్కించుకున్న‌ది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ తెలుగు మూవీగా ఆర్ఆర్ఆర్ రికార్డును క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ తో పాటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి, బాహుబ‌లి 2 కూడా భార‌తీయ సినీ హిస్ట‌రీలోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాలుగా నిలిచాయి.

ఈ సినిమాల‌తో రాజ‌మౌళి క్రేజ్ పాన్ ఇండియ‌న్ స్థాయిని దాటేసింది. రాజ‌మౌళితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌, కోలీవుడ్‌తో మాత్ర‌మే హాలీవుడ్‌ యాక్ట‌ర్స్ సైతం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

డైరెక్ట‌ర్‌గానే కాకుండా అడ‌పాద‌డ‌పా స్క్రీన్‌పై క‌నిపించి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు రాజ‌మౌళి. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి, మ‌గ‌ధీర‌,...