భారతదేశం, మార్చి 19 -- SS Rajamouli: బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్, దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నేడు (మార్చి 19) వచ్చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ మలయాళం స్టార్ నటుడు, పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమాల వివరాలివే..

రాజమౌళి సమర్పణలో ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాలు రానున్నాయి. ఈ సినిమాల టైటిల్, ఫస్ట్ లుక్ కూడా నేడు రివీల్ చేసింది మూవీ టీమ్. ఆర్కా మీడియా పతాకంపై శోభూ యార్లగడ్డ, ప్రదాస్ దేవినేని, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు కొత్త దర్శకులు తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాలకు ...