భారతదేశం, మార్చి 8 -- SRSP Car Accident : వరంగల్ జిల్లా ఎస్సారెస్పీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ లోకి ఓ కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో మొదట రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోగా.. తల్లి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. కాగా తండ్రితో పాటు ఐదేళ్ల చిన్నారి కారుతో సహా గల్లంతవ్వగా.. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కెనాల్ నుంచి కారును బయటకు తీయడంతో అందులో తండ్రీకూతుళ్ల మృతదేహాలు బయటపడ్డాయి.

దీంతో కెనాల్ కారు ప్రమాద ఘటన విషాదంతో ముగిసినట్లయ్యింది. కాగా భర్తతో పాటు ఇద్దరు పిల్లలు జలసమాధి కావడంతో ఆ తల్లి రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కాగా కారు కెనాల్ లోకి దూసుకెళ్లే ముందు వాళ్లంతా సెల్ఫీ దిగగా.. అది చూసి వారి కుటుంబ సభ్యులంతా బోరున విలపిస్తున్నారు....