భారతదేశం, జనవరి 24 -- సు-ప్ర భాతము అంటే.. మంచి ఉదయం అని అర్ధం. హిందూ పూజా విధానాలల్లో, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలో భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ. ఆ సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అంటారు. ఇది ఎలా చేస్తారో తెలుసుకుందాం.

1.ప్రతి రోజూ బ్రహ్మ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి, బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు.

2.అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనం, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్...