తెలంగాణ,శ్రీశైలం, డిసెంబర్ 28 -- ఇయర్ ఎండ్ వచ్చేసింది..! ఈ చివరి వీకెండ్ లో ఏదైనా అధ్యాత్మిక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్. రెండు రోజులపాటు ఉంటుంది. బస్సులో జర్నీ ఉంటుందని తెలంగాణ టూరిజం పేర్కొంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా. శ్రీశైలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ డిసెంబర్ 29, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....