భారతదేశం, ఫిబ్రవరి 11 -- Srisailam Mahashivratri : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుని తరిస్తుంటారు భక్తులు. ఇటీవల తిరుపతి దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్ష నిర్వహించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

శ్రీశైలం ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించ...