భారతదేశం, మార్చి 9 -- శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ప్రాంతంలో గొయ్యి ఏర్పడింది. 2009 లో భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైంది. అప్పుడు ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. శ్రీశైలం ఆనకట్ట దిగువన ప్లంజ్ పూల్ ఉంటుంది. శ్రీశైలం ఆనకట్ట పునాది 380 అడుగులుగా ఉండగా.. ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి 120 మీటర్ల వరకు ఉందని అంటున్నారు.

ఈ గుంత డ్యామ్ పునాదుల లోతును మించిపోయిందని.. ఇది డ్యామ్ భద్రతకు ప్రమాదకరం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గుంత డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెళుసుతో ఉన్న జాయింట్ల (షీర్ జోన్)ను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తక్షణ మరమ్మతులు చేపట్టకపోతే.. ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రభావంతో ఈ గొయ...