భారతదేశం, ఏప్రిల్ 13 -- Srinivas Varma Counter To Karumuri : వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. కారుమూరి తణుకు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిచారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పార్టీ కార్యకర్తల చప్పట్ల కోసం....నరికేస్తాం, చంపేస్తాం అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. కారుమూరి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారన్నారు. అతి తక్కువ రోజుల్లో ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నీ కాళ్లు, చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా, ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు" అని శ్రీనివాస వర్మ మండిపడ్డారు. వైసీపీ నేతల పేర్ని నాని, అంబటి...