భారతదేశం, ఏప్రిల్ 22 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 విడుదలకు సన్నద్ధమవుతోంది. మే 1వ తేదీన ఈ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ వైలెంట్‍గా ఇంటెన్సిటీతో సాగి చిత్రంపై అంచనాలను మరింత అధికంగా చేసింది. ఈ మూవీలో నాని సరనస హీరోయిన్‍గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. హిట్ 3 సినిమా హిందీ ప్రమోషన్లలో కోసం నేడు (ఏప్రిల్ 22) ముంబైలో మీడియాతో మాట్లాడారు నాని, శ్రీనిధి శెట్టి.

హీరో నాని ప్రొడక్షన్ హౌస్‍ 'వాల్‍పోస్టర్ సినిమా'కు మంచి పేరు వచ్చింది. ఈ బ్యానర్ కింద ఇటీవల వచ్చిన కోర్ట్ సినిమా కమర్షియల్‍గా హిట్ అవటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. హిట్ 3 మూవీని నానినే ప్రొడ్యూజ్ చేశారు. దీంతో నిర్మాతగా ఎలా ఉందనే ప్రశ్న నానికి ఎదురైంది.

తన చిత్రాన్ని తానే ప్రొడ్యూజ్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని నాని చెప్పా...