భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో 8 మంది మహిళలు, 12 సంవత్సరాల బాలుడు ఉన్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి వచ్చారు. రెయిలింగ్ ఊడి పడి ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది వరకు గాయపడ్డారు. స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో జనాలు క్యూ లైన్లో చిక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. సాయం కోసం ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో మెట్ల దగ్గర ఇరుక్కుపోయిన భక్తులు తొక్కిసలాట నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సంఘటన సమయంలో మహిళలు సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించారు.

గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుప...