భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం ఆందోళనకర విషయం. క్యూలైన్లలో తోపులాట జరగటం, అదే సమయంలో రెయిలింగ్ విరిగిపోవటం వల్ల ఈ విషాదం జరిగినట్టు సమాచారం. ఘటనాస్థలం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అత్యంత భయానకంగా, విషాదకరంగా ఉన్నాయి.

మహాకుంభ మేళా తొక్కిసలాట, దిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట తిరుపతి క్యూ లైన్లలో తొక్కిసలాట, ఆర్సీబీ పరేడ్​లో తొక్కిసలాట నుంచి నేటి శ్రీకాకుళంలో జరిగిన ప్రమాదం వరకు.. ఈ ఏడాది అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెలవు దినాల్లో, పండుగ వేళ్లల్లో ఆలయాలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది.

ఈ సమస్యకు పరిష్కారం లేదా? అనే సందేహ...