భారతదేశం, మార్చి 22 -- Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల్లో చూచిరాత‌ల‌కు ఉపాధ్యాయులు స‌హ‌క‌రించారు. దీంతో 11 మంది ఉపాధ్యాయుల‌ను సస్పెండ్ చేశారు. ముగ్గురు ప్రధానోపాధ్యాయుల‌పై చ‌ర్యల‌కు సిఫార్సులు చేశారు. అలాగే ఒక బోధనేతర సిబ్బందిని స‌స్పెండ్ చేయ‌డంతో పాటు ఐదుగురు విద్యార్థుల‌ను డిబార్ చేశారు. ఈ ఘ‌ట‌నతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిప‌డింది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండ‌లం కుప్పిలి ఆద‌ర్శ పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల్లో అక్రమాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌రీక్షా కేంద్రం 'ఏ'లో 207 మంది, ప‌రీక్షా కేంద్రం 'బి'లో 218 మంది విద్యార్థుల‌కు కేటాయించారు. కుప్పిలిలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌ ఉపాధ్యాయులే స్లిప్పులు త‌యారు చేసి ఆద‌ర్శ ...