ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 12 -- శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై ఒక వ్య‌క్తి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న బాలిక‌కు వేరుశెన‌గ చెక్కి ఇచ్చి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. విష‌యం తెలుసుకున్న బాలిక కుటుంబ‌ స‌భ్యులు అతడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లా సార‌వ‌కోట మండ‌లంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం సార‌వకోట మండ‌లంలోని ఒక గ్రామంలో రామారావు అనే వ్య‌క్తి (47) కుటుంబం జీవిస్తోంది. ఆయ‌న‌కు భార్య‌, వివాహితులైన ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. సోమ‌వారం అదే గ్రామంలో చింత చెట్టు కింద ఇద్ద‌రు బాలిక‌లు ఆడుకుంటున్నారు. అటుగా వెళ్లి ఆడుకుంటున్న బాలిక‌ల‌ను రామారావు ...