భారతదేశం, మార్చి 18 -- Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బిస్కెట్లు ఆశ‌చూపి ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం న‌గ‌రంలో ఒక అపార్ట్‌మెంట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం శ్రీ‌కాకుళం న‌గ‌రంలో ఒక అపార్ట్‌మెంట్‌లో పొందూరు మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి (80) సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నాడు. ఆయ‌న భార్య అదే అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ల్లో ప‌నులు చేస్తోంది. ఇద్దరు కుమార్తెల‌తో క‌లిసి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో గ‌దిలో ఆ కుటుంబం నివాసం ఉంటుంది.

అయితే ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ల...