భారతదేశం, జనవరి 31 -- విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘ‌ట‌న‌ శ్రీకాకుళంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ కళాశాల హాస్ట‌ల్‌లోకి గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాత్రి వేళ‌లో ప్ర‌వేశించారు. బీఎస్సీ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థినిపై.. హాస్ట‌ల్ ప్రాంగ‌ణంలోనే దారుణానికి ఒడిగ‌ట్టారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి, అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. దుండ‌గులు అఘాయిత్యానికి పాల్పడటంతో.. విద్యార్థిని అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది.

తీవ్ర‌గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో స్నేహితురాలు ఉండ‌టాన్ని తోటి విద్యార్థినులు గ‌మ‌నించారు. హాస్ట‌ల్ సిబ్బందికి స‌మాచారం అందించారు. బాధితురాలిని హుటాహుటిన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థిని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌రా...