భారతదేశం, ఫిబ్రవరి 11 -- Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లా ప‌లాస మండ‌లంలోని ఒక గ్రామంలో దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధిత యువ‌తి కుటుంబ స‌భ్యులు తెలిపి వివ‌రాల ప్ర‌కారం వ‌రిశి భాస్క‌ర‌రావు ఆ ఊరులో పెద్ద మ‌నిషి త‌ర‌హాలో ఉన్నారు. రాజ‌కీయాల్లో తిరుగుతున్నాడు.

త‌ల్లిదండ్రులు కూలీ ప‌నుల నిమిత్తం హైద‌రాబాద్ వెళ్ల‌డంతో దివ్యాగురాలైన యువ‌తి (20) త‌న నాన్న‌మ్మ వ‌ద్ద ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమె వ‌రిశి భాస్క‌ర‌రావు ఇంట్లో ప‌ని చేసేందుకు వెళ్లేది.

ఇంట్లో ప‌ని చేసేందుకు ప్ర‌తి రోజూ ఆ యువ‌తి రావ‌డంతో ఆమెపై భాస్క‌ర‌రావు క‌న్నేశాడు. దీంతో ఆమెను మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ దివ్యాంగు యువ‌తిపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో ఆమె గ‌ర్భం దాల్చ...