భారతదేశం, మార్చి 7 -- Srikakulam Army Soldier: జ‌మ్మూకాశ్మీర్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జ‌వాన్ మృతి చెందారు. త‌న స‌ర్వీస్ రైఫిల్ నుండి బుల్లెట్ పేలడంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ నుంచి ఆర్మీ జవాన్ పార్దీవ‌దేహాన్ని గురువారం స్వ‌గ్రామానికి చేరుకుంది. అనంత‌రం సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.

శ్రీ‌కాకుళం జిల్లా వ‌జ్ర‌పుకొత్తూరు మండ‌లంలోని అమ‌ల‌పాడు గ్రామానికి చెందిన బ‌చ్చ‌ల వెంక‌ట‌రావు, కామేశ్వ‌రి దంప‌త‌ల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు తిరుప‌తి రావు (26) 2017లో ఆర్మీలో చేరాడు. తండ్రి వెంక‌ట‌రావు సైతం బీఎస్ఎఫ్‌లో జ‌వాన్‌గా విధులు నిర్వ‌హించారు. తిరుప‌తి రావుకు ఇటీవ‌లే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. అంత బాగానే ఉ...