భారతదేశం, మార్చి 19 -- వ‌ర్ష‌, ఇమాన్యుయేల్ జోడీ చాలా కాలంగా జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో క‌లిసి స్కిట్‌లు చేస్తున్నారు. ఈ జ‌బ‌ర్ధ‌స్థ్ షో ద్వారానే వీరిద్ద‌రు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుల‌య్యారు. సుధీర్ - ర‌ష్మీ త‌ర్వాత వ‌ర్ష‌, ఇమాన్యుయేల్ జోడీ జ‌బ‌ర్ధ‌స్థ్‌లో బాగా పాపుల‌ర్ అయ్యింది. స్కిట్‌ల‌లో వీరిద్ద‌రి కెమిస్ట్రీ, ఒక‌రితో మ‌రికొరికి ఉన్న అనుబంధం కార‌ణంగా వ‌ర్ష‌, ఇమాన్యుయేల్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు గ‌తంలో వార్త‌లొచ్చాయి.

ఈ పుకార్ల‌పై వ‌ర్షం, ఇమాన్యుయేల్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఔన‌ని, కాద‌ని చెప్ప‌లేదు. వ‌ర్ష‌, ఇమాన్యుయేల్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన‌ట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది త‌న‌కు, ఇమ్మూకు మ‌ధ్య చాలా గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌రినొక‌రం అన్‌ఫాలోతో పాటు బ్ల...