భారతదేశం, మార్చి 16 -- ఈ ఘ‌ట‌న శ్రీస‌త్య‌సాయి జిల్లాలో క‌దిరి ప‌ట్టణంలో చోటు చేసుకుంది. క‌దిరి ప‌ట్ట‌ణంలో ఓ ప్రైవేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి హోలీ పండ‌గ రోజున సెల‌వు ఇచ్చారు. కానీ ప్రిన్సిపాల్ వెంక‌ట‌ప‌తి స్పెష‌ల్ క్లాస్ పేరుతో డిగ్రీ విద్యార్థినుల‌ను కాలేజీకి ర‌మ్మ‌న్నారు. ప్రిన్సిపాల్ ఆదేశాల‌తో విద్యార్థినులు కాలేజీకి వ‌చ్చారు. అక్కడ ప్రిన్సిపాల్‌ హోలీ సంబ‌రాలకు తెర‌లేపారు. ఈ క్ర‌మంలో రంగులు చ‌ల్లుకుంటూ విద్యార్థినుల‌ను ప‌దే ప‌దే తాకుతూ వికృతంగా ప్ర‌వ‌ర్తించాడు.

విద్యార్థినులు ప‌రిగెత్తుతుంటే, వారి వెంట‌ప‌డి తరుముతూ ఎత్తుకోవ‌డం, అవ‌య‌వాల‌ను తాకుతూ నేల‌పై పొర్లుదండాలు పెట్టించ‌డం వంటి వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డాడు. అమ్మాయిల‌ను ఒక‌రి త‌రువాత ఒక‌రిని ఎత్తుకుని బుర‌ద‌లో ప‌డేసి, వారిపై ప‌డి ఎక్క‌డప‌డితే అక్క‌డ తాక‌డం వంటివి చేష్ట‌ల‌కు దిగారు...