భారతదేశం, ఏప్రిల్ 19 -- సోషల్ మీడియాలో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి చిక్కులను ఎదుర్కొంటున్నారు. వరుసగా నోటీసులను అందుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు శ్రీరెడ్డి. ఇటీవల నోటీసులు అందుకున్న ఆమె నేడు (ఏప్రిల్ 19) విచారణకు హాజరయ్యారు.

విచారణకు హాజరైన శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. మళ్లీ పిలిచినప్పుడు రావాలంటూ 41ఏ నోటీసులు అందజేశారు. కాసేపు విచారణ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లారు శ్రీరెడ్డి.

ఆంధ్రప్రదేశ్‍‍లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వరుసగా చేశారు. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‍ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కొన్ని అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలు చేశా...