Hyderabad, ఏప్రిల్ 6 -- శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అక్కడ పంచి పెట్టే పానకం, వడపప్పు, చలిమిడి ప్రసాదాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ రోజున తయారు చేసే పానకం అంటే పడి చచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. ఈ పానకం రుచి ఎంత బాగుంటుందంటే దీన్నీ ఎండలో, క్యూలో నిలబడి మరీ తాగుతుంటారు. ఈసారి అంత శ్రమ పడకుండా రామనవమి పానకం కోసం గంటల తరబడి లైన్లో నిలబడకుండా ఇంట్లోనే మీరే రుచకరమైన పానకం తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఈ రెసిపీతో తయారు చేశారంటే బయట పంచిపెట్టే పానకం రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. వీలైతే మీరే అందరికీ పంచి పెట్టచ్చు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీరామనవమి స్పెషల్ పానకం ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.

Published by HT Digital Content Services with perm...