భారతదేశం, ఏప్రిల్ 7 -- Sri Rama Pattabhishekam : కల్యాణ రాముడు రారాజుగా మారారు. 'తక్కువేమీ మనకు రాముడు ఒక్కడుండు వరకు... 'అంటూ భక్తుల శ్రీరామ నామ స్మరణలు మిన్నంటాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణతో మిధిలా ప్రాంగణం పులకించింది. దక్షిణ అయోధ్యపురి భద్రగిరి భక్తులతో అలరారింది. శ్రీరామ పట్టాభిషేకం వేడుక నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకలైన సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం తదితర మహోత్సవాలకు హాజరైన భక్తజనం తీపి జ్ఞాపకంతో వెనుదిరిగింది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిధిలా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం వేడుక భక్తులను అలరించింది. తొలుత రామాలయం భద్రుని మండపంలో అర్చక స్వాము...