Hyderabad, ఏప్రిల్ 6 -- శ్రీరామనవమి ప్రధానమైన పండగల్లో ఒకటి. ఇది శ్రీరాముని జన్మదినమే కాదు... శ్రీరాముడు సీతాదేవిలా వివాహ మహోత్సవం జరిగిన రోజు కూడా. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథినాడు ఈ అద్భుతమైన ఘట్టం జరిగింది. శ్రీరామనవమికి శ్రీరాముడి ఆశీస్సులు బంధుమిత్రులకు అందరికీ అందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

శ్రీరామనవమి నాడు శ్రీరాముని ఆలయాల్లో పూజలు చేస్తారు. రామ కథను వినిపిస్తారు. సీతాదేవి శ్రీరాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ఇక్కడ మేము శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేశాము. మీకు నచ్చిన సందేశాన్ని ఎంపిక చేసి మీ బంధుమిత్రులకు పంపించండి.

1. శ్రీరాముని ఆశీస్సులతో

ఈ దేశంలోని ప్రతి ఇల్లు

ఆనందం శాంతి శ్రేయస్సుతో నిండి పోవాలని

కోరుకుంటున్నాము

శ్రీరామనవమి శుభాకాంక్షలు

2. రాముని కథ

రామనామం

రాముని ఆరాధ...