Hyderabad, ఏప్రిల్ 5 -- చలిమిడి పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది వివాహ సందర్భాలే. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది. ఆ వివాహం మహోత్సవంలో ప్రసాదంగా చలిమిడి ఉండాల్సిందే. వడపప్పు, పానకంతో జతగా చలిమిడిని కూడా పక్కన పెడతారు.

ఈ మూడు ప్రసాదాలు అక్కడ ఉంటేనే వివాహంలో ఏ లోపం రాకుండా ఉంటుంది. మీరు కూడా శ్రీరామ నవమికి చలిమిడి చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ మేము చలిమిడి రెసిపీ ఇచ్చాము. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. వీటిని పచ్చి చలిమిడి, పాకం చలిమిడి అని రెండు రకాలుగా పిలుస్తారు. మీకు ఏది నచ్చితే అది వండుకోండి.

తెలుగు వారి సంప్రదాయాల్లో చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అయ్యాక కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఆమెతోపాటు చలిమిడి కుండను కూడా పెడతారు. ఆ చలిమిడిని చుట్టుపక్కల వారికి పంచుతారు. అలాగే గర్భవతి అయ్యాక కూడా ప...