భారతదేశం, అక్టోబర్ 6 -- చుట్టూ ద‌ట్టమైన అడ‌వి, అందులోనూ వెదురు పొద‌లు ఆ మ‌ధ్యలోనే కోర్కెలు తీర్చే క‌ల్పవ‌ల్లి శ్రీ‌గ‌డి బాప‌న‌మ్మ అమ్మవారి గుడి ఉంటుంది. వెదురు పొదల్లో వెలిసిన గ‌డి బాప‌న‌మ్మ అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రజ‌లు ప‌రిత‌పిస్తారు. మాతృశ్రీ గడి బాపనమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఉగాది స‌మయంలో ఐదు రోజుల పాటు జ‌రుగుతాయి.

శ్రీ‌గడి బాప‌న‌మ్మ అమ్మవారు అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారి దగ్గరకు ఎవరైనా కాలి చెప్పులు తీయకుండా వెళితే ముఖం తిరిగినట్లు ఉంటుందని, మొక్కులు మొక్కిన వాళ్లు తీర్చక పోతే వాళ్లకు మైకం కమ్మినట్లు అనిపిస్తుంది అని భక్తుల నమ్మకం.

రామాయణం కాలంలో రాముడు, సీతాదేవి వనవాసం చేసే సమయంలో క్షణకాలం ఇక్కడ సేద తీరారని, అందువలన ఈ గ్రామానికి సీతపల్లి అని పేరు వచ్చిందని అంటారు. పూర్వకా...