Hyderabad, మార్చి 12 -- Sreeleela Dating: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తోందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ఆశిఖీ 3 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచీ డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అయితే వాటిని పరోక్షంగా కార్తీక్ ఆర్యన్ తల్లి కన్ఫమ్ చేసినట్లు అనిపిస్తోంది.

శ్రీలీల తన తొలి బాలీవుడ్ మూవీ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆశిఖీ 3లో నటిస్తోంది. అయితే అప్పుడే అతనితో డేటింగ్ అనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ మధ్యే కార్తీక్ ఇంట్లో జరిగిన వేడుకకు ఆమె వెళ్లడం కూడా వీటికి మరింత బలాన్నిచ్చాయి. ఇక తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా కూడా పరోక్షంగా వీళ్ల డేటింగ్ వార్తలను కన్ఫమ్ చేసేలా మాట్లాడింది. ఈ మధ్య జరిగిన ఐఫా 2025లో ఆమె కరణ్ ...