భారతదేశం, మార్చి 13 -- శ్రీలీల.. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఓ వైపు సీనియర్ స్టార్ హీరోలతో.. మరోవైపు కుర్రాళ్లతో ఆడిపాడుతోంది ఈ భామ. 23 ఏళ్లకే వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. అలాంటి స్టార్ హీరోయిన్ కు ఇద్దరు పిల్లలున్న సంగతి మీకు తెలుసా? అదేంటీ శ్రీలీలకు ఇంకా పెళ్లే కాలేదు.. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటారా?

గ్లామర్, హాట్ నెస్, యాక్టింగ్ తో అదరగొట్టే శ్రీలీలకు గోల్డెన్ హార్ట్ కూడా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. శ్రీలీల మంచి మనసుతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. అది కూడా దివ్యాంగులు కావడం శ్రీలీల గోల్డెన్ హార్ట్ ను చాటుతోంది.

2022లో శ్రీలీల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఓ అనాథశ్రమానికి వెళ్లిన ఆమ...