Hyderabad, మార్చి 1 -- Sree Vishnu Upcoming Movies: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. డిఫరెంట్ కామెడీ టైమింగ్‌తో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరికి అర్థం కాని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాడు.

సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ సినిమాలతో వరుసగా ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు అప్ కమింగ్ సినిమాలతో బీజీగా ఉన్నాడు శ్రీ విష్ణు. ఇప్పటివరకు కామెడీ, లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాతో శ్రీ విష్ణు ప్రేక్షకులను అలరించనున్నాడు.

డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ఆకట్టుకోనున్నాడు. ఆ సినిమానే మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం ...