Hyderabad, మార్చి 1 -- ఆరోగ్యానికి మొలకలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రోజూ క్రమం తప్పకుండా మొలకలు తినేలా తమ డైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇలా రోజూ చప్పటి మొలకలను నేరుగా తినడం పిల్లలకు నచ్చనే నచ్చదు. పిల్లలకు కాదు పెద్దలకు కూడా ఇది కష్టమైన పనే అనుకోండి. అందుకే ఈ సారి నేరుగా మొలకలు తినలేం అనిపించినప్పుడు, వాటితోనే కొత్తగా ఏదైనా చేసుకుని తినాలి అనుకుంటున్నప్పుడు మొలకలతో పొంగనాలు ఇలా పొంగనాలు వేసి ఇవ్వండి.

వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా కచ్చితంగా ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. మొలకల పొంగనాలను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా చేసి పెట్టారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పొందచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆరోగ్యాన్ని పెంచే రుచికరమైన మొలకల పొంగనాలు తయారు చేయడానికి ఏయే పదార్థాలు కావాలో, వీటిని ఈజీగా, త్వరగా ఎలా ...