భారతదేశం, నవంబర్ 23 -- స్పాటిఫై యూజర్స్​కి బిగ్​ అప్డేట్​! వినియోగదారులు ఇతర మ్యూజిక్​ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమ ప్లేలిస్ట్‌లను నేరుగా తమ ఖాతాలోకి ట్రాన్స్​ఫర్​ చసేందుకు వీలుగా స్పాటిఫై సరికొత్త ఫీచర్​ని పరిచయం చేసింది. తమ సంగీత ప్రపంచాన్ని స్పాటిఫైకి మార్చాలని యోచిస్తున్న ఎవరికైనా ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఈ కంపెనీ యాప్‌లో "ఇంపోర్ట్ యువర్‌ మ్యూజిక్" అనే కొత్త ఫీచర్​ని జోడించింది.

ప్లేలిస్ట్ ట్రాన్స్​ఫర్​ని యాప్‌లోకి తీసుకురావడానికి స్పాటిఫై TuneMyMusic సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ప్లేలిస్ట్ మైగ్రేషన్‌కు ట్యూన్‌మైమ్యూజిక్ చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఇప్పుడు ఈ కొత్త అనుసంధానం ద్వారా ఆ ఫంక్షన్ స్పాటిఫై ఇంటర్‌ఫేస్‌లో లభ్యం అవుతోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ యాప్‌లో 'యువర్‌ లైబ్రరీ' విభాగంలో...