Hyderabad, మార్చి 19 -- బోడ కాకర కాయలు సీజనల్ గా లభిస్తాయి. కాబట్టి వీటిని కచ్చితంగా తినాలి. అతి తక్కువగా దొరకే ఆకు పచ్చని కూరగాయలు కూడా ఇవి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు తరచుగా ఆకుపచ్చ కూరగాయలను తినమని సిఫార్సు చేస్తారు. పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆకుపచ్చని కూరగాయలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

అటువంటి ఒక ఆకుపచ్చ కూరగాయల్లో బోడకాకర కాయలు ఒకటి. వాటిని ఆకాకరక కాయలు, అడవి కాకర కాయలు అని కూడా పిలుస్తారు. కంటోలా అనే పేరు కూడా ఉంది. బోడ కాకర కూర, వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా అధికం. వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

బోడకాకర కాయలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, సోడియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా కలిసి అయిదు రకాల ప్రధాన వ్యాధు...