Hyderabad, జనవరి 27 -- ఆధునిక కాలంలో పురుషుల వల్ల సంతానలేమి సమస్య పెరిగిపోతోంది. గర్భం ధరించకపోతే లోపం భార్యలోనే ఉందనుకుంటారు, నిజానికి మగవారిలో వీర్య కణాలు తక్కువగా ఉన్నా, వాటిలో నాణ్యత లేకపోయినా కూడా గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. వీర్య కణాలు తక్కువగా ఉండే పరిస్థితిని ఒలిగోస్పెర్మియా అంటారు.

స్థూలకాయం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వాడకం, ధూమపానం, వృషణాలకు గాయం, కీమోథెరపీ వంటి పరిస్థితులు కూడా స్పెర్మ్ కణాల నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి గల కారణాలను బెంగళూరులోని స్పర్శ్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గిరిరాజ వేలాయుధం వివరించారు.

1. జీవనశైలి: చెడు జీవనశైలి కూడా వీర్యంలోని కణాల సంఖ్యను తగ్గిస్తాయి. ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, మాదకద్రవ్యాల వాడకం, అనారోగ్యకరమైన ఆహ...